కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

cm kcr

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టిఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, పార్టీ ప్రచారం, వచ్చిన ఓట్లపై విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి సంసిద్ధం కావడంపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసే అవకాశముంది. క్యాడర్ బలోపేతంతో పాటు ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకంకావడంపై కెసిఆర్ పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీటింగ్ అనంతరం నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఫాం హౌస్ కేసుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వవచ్చని సమాచారం. ఈ అంశంపై పార్టీ నేతల్లో నెలకొన్న అనుమానాలను ఆయన నివృత్తి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఈసీ ప్రకటన అనంతరం బీఆర్ఎస్ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కూడా పార్టీ నేతలతో కెసిఆర్ చర్చించే ఛాన్సుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/