కృష్ణ పార్థివదేహాన్ని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన మోహన్‌బాబు

నానక్ రామగూడ లో కృష్ణ భౌతికకాయానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నివాళ్లు అర్పించారు. మహేష్ బాబు తో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి సోదరా.. సోదరా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన మోహన్‌బాబు.. కృష్ణ మృతదేహంపై పడి బోరున విలపించారు. అక్కడే కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఇక ఉదయం నుండి కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు వస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ , టీడీపీ అధినేత చంద్రబాబు, వెంకయ్య నాయుడు , కేటీఆర్ , హరీష్ రావు , ఎర్రబెల్లి మొదలగు రాజకీయ ప్రముఖులు నివాళ్లు అర్పించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ , వెంకటేష్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగచైతన్య, కీరవాణి, బోయపాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ , రామ్ చరణ్ , సాయి కుమార్ తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించడం జరిగింది. మరికాసేపట్లో గచ్చిబౌలి లోని స్టేడియం లో అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాని ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపనున్నారు.