ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?:గుడివాడ అమర్ నాథ్

చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు

gudivada amarnath
gudivada amarnath

అమరవతిః మంత్రి గుడివాడ అమర్ నాథ్ టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రూ. 118 కోట్లు చాలా చిన్న తీగ మాత్రమేనని, పెద్ద డొంక ఉందని అన్నారు. నోటీస్ లో లోకేశ్ పేరు కూడా ఉందని చెప్పారు. సీమన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్ల స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, జైలు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈడీ కూడా కలగజేసుకోవాలని చెప్పారు. ఐటీ శాఖ 46పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించాడని చురకలు అంటించారు. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా…? అని ప్రశ్నించారు. అమరావతిలో దొంగతనం చేసి జ్యురిడిక్షన్ కాదని ఐటీ శాఖతో వితండ వాదన చేస్తున్నారని ఆగ్రహించారు.