క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్‌గా గ్రేమ్ స్మిత్
2022 మార్చి వరకు కొనసాగనున్న స్మిత్

కేప్‌టౌన్: క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఏ) తాత్కాలిక డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడగించారు. ఈ రెండేళ్లపాటు అతడు పూర్తి స్ధాయిలో డైరెక్టర్‌గా కొనసాగించేందుకు క్రికెట్ సౌతాఫ్రీకా నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేమ్ స్మిత్ సిఎస్‌ఎ డైరెక్టర్‌గా 2022 మార్చి నెల వరకు కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని తాత్కాలిక ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాక్వస్ ఫాల్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/