కర్నూలులో మరో కరోనా మరణం
కలెక్టర్ వీరపాండియన్ వెల్లడి

కర్నూలు: కరోనా కారణంగా జిల్లాలో ఈ రోజు ఓ వ్యక్తి మరణించాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 16 కు చేరుకుంది. కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఉదయం కర్నూలు లోని విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటివరకు జిల్లాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3 కు చేరిందని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రజలు అత్యవసరమయితేనే బయటకు రావాలని. అనవసరంగా బయటకు రాకూడదని కలెక్టర్ సూచించాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/