ధోని పునరాగమనం కష్టమే
అజారుధ్ధీన్ అభిప్రాయం

హైదరాబాద్: కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఖాళీగా ఉన్న క్రికెటర్లు వీడియో కాన్ఫరెన్స్‌లు, చిట్‌ఛాట్‌లు చేస్తున్నారు. కొందరు ధోని భవిష్యత్తుపై చర్చిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై అజారుద్దిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఐపిల్ 2020 వాయిదా పడింది. దీంతో ఎంఎస్ ధోని ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడం ఆలస్యం చేసింది. ఐపిఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుధీర్ఘ విరామం తరువాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో ధోని పునరాగమనం చేయండం కష్టమే అని అజారుధ్దీన్ అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/