కుంబ్లేపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగి ఉంటే అనేక రికార్డులు బద్దలయ్యేవి

goutham gambhir
goutham gambhir

ముంబయి: భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌, భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కుంబ్లే భారత్‌కు ఎక్కువకాలం కెప్టెన్‌గా కొనసాగి ఉంటే సారథ్యానికి సంబందించిన అనేక రికార్డులు బద్దలయ్యేవి అని అన్నాడు. తాను ఆడిన కాలంలో కుంబ్లేనే అత్యుత్తమ కెప్టెన్‌ అని తెలిపాడు. కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని అనేక రికార్డులు సాధించినప్పటికి కుంబ్లేనే బెస్ట్‌గా భావిస్తానని అన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/