ధరణి మార్గదర్శకాలని జారీ చేసిన ప్రభుత్వం

Govt issued Dharani guidelines

హైదరాబాద్ః ధరణి మార్గదర్శకాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. సమస్యల పరిష్కారానికి అధికారులని ప్రభుత్వం అలానే ఆర్డిఓ లకి అధికారుల్ని బధలాయించింది. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాల బ‌ద‌లాయింపు చేసింది. త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాలు బ‌ద‌లాయింపు చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది.

17 రకాల మాడ్యుల్స్​కు సంబంధించి సవరింపుల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది. ధరణి పోర్టల్​లో సవరింపుల కోసం పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు సంఖ్య 2,45,037గా ఉంది. పట్టాదారు పాస్​పుస్తకాల్లో డేటా కరెక్షన్​ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. రికార్డుల అప్​డేషన్​ పేరుతో నిషేధిత జాబితా పార్ట్​-బిలో 13.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. అలాగే ఎలాంటి కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.