ఇకపై విమానంలో కూడా వైఫై సేవలు

ఎయిర్‌లైన్స్‌కు ఆమోదం తెలిపిన ప్రభుత్వం

airlines to provide in-flight Wi-Fi services
airlines to provide in-flight Wi-Fi services

న్యూ ఢిల్లీ: విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎయిర్ లైన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇంటర్నెట్ సేవలను ప్రయాణీకులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతి ఇస్తూ పౌర విమానయాన శాఖ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. విమాన ప్రయాణం సమయంలో ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేలా ప్రయాణీకులకు పైలట్ ఇన్ కమాండ్ అనుమతిని ఇవ్వవచ్చునని, తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈరీడర్ వంటి డివైజ్‌లను ఫ్లైట్ మోడ్ లేదా ఎరోప్లేన్ మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది. అయితే విమానంలో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలను అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ధ్రవీకరించవలసి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అనుమతి నేపథ్యంలో విస్తారా ఎయిర్ లైన్స్ తొలి బోయింగ్ 787-9 విమానాన్ని వాషింగ్టన్‌లో అందుకుంది. భారత్‌లో ఇన్ఫ్లైట్ వైఫై సేవలను అందించనున్న తొలి విమానం ఇదే కానుందని విస్తారా సీఈవో పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/