నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌ తమిళిసై

నల్లగొండ: నేడు నల్లగొండ జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పర్యటించనున్నారు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలోని సంతోషిమాత ఆలయ పునఃప్రారంభంలో పాల్గొంటారు. అనంతరం అర్జాలబావి, అనిశెట్టి దుప్పలపల్లిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్‌సీఐ, కేంద ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రైతు సంఘాల నేతలు, వివిధ ప్రజాసంఘాలు గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/