ఇండియా కు IMA వార్నింగ్‌..

ఇండియా కు IMA వార్నింగ్‌..
Corona claw again in America

భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో IMA (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్) వార్నింగ్ ఇచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా భారత్ లో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని IMA హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండేకులు చేరుకుందని…. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఇలాంటి త‌రుణంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా క‌రోనా వ్యాక్సిన్‌ వేయాలని అభిప్రాయ ప‌డింది. ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో… ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 46 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇటు దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియా లో 24 కు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.