అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకెళ్తుంది….గ‌వ‌ర్న‌ర్

ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళి సైకి సీఎం కెసిఆర్ స్వాగతం పలికారు. ఉదయం ఆమె ప్రసంగం ప్రారంభమైంది. ఉభయసభలు సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళి సై ప్రసంగించారు. గవర్నర్ తమిళి సై తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తోంద‌ని, అభివృద్ధిలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచింద‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.


గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

•అన్నివర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

•పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచాం

•కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం

•ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నాం

•సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

•అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది

•ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోంది

•రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించాం

•వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోంది

•ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగింది

•ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నాం

•కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి

•తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం

•కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టాం

•కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ ఎంతో కష్టపడ్డారు: గవర్నర్‌ తమిళిసై

•కరోనా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌గా ముందుకు సాగుతోంది

•విద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించింది

•అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం

•వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం

•విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారింది

•జాతయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్‌ తలసరి వినియోగం ఎక్కువ

•విద్యుత్‌రంగ సంస్కరణపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది

•తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం

•మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది

•గిరిజన గ్రామాలు, తండాలకు కూడా మంచినీటిని అందిస్తున్నాం

•57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు

•తెలంగాణను ఫోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం

•మిషన్‌ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం

•తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి

•రెవెన్యూ వసూళ్లలో రాష్ట్ర అగ్రగామిగా ఉంది

•సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది

•సమైక రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు

•పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం

•కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చాం

•భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి

•త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి

•డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం

•రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు

•తెలంగాణలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు

•తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు

•పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపు

•ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది

•64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/