వ్యాక్సిన్‌ ల్యాబ్‌ను పరిశీలించిన ప్రధాని

అహ్మదాబాద్ లో ‘జైకోవ్‌డి’ ప్రయోగాల పరిశీలన

pm-modi-wear-ppe-kit
PM Narendra Modi reviews COVID vaccine facilities at Zydus Cadila plant in  Ahmedabad: Exclusive Pics | News | Zee News
Modi reviews COVID vaccine facilities
Coronavirus News LIVE Updates: At Zydus Cadila to Review Vaccine Progress,  Modi Greets Ahmedabad; Next Stop Hyd's Bharat Biotech, Pune's Serum  Institute

అహ్మదాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధాని మోడి అహ్మదాబాద్‌ చేరుకుని, అక్కడి నుంచి జైడస్‌ క్యాడిలా పార్కుకు చేరుకున్నారు. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘జైకోవ్‌డి’ టీకా ప్రయోగాలను మోడి పరిశీలించారు. ఆ వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పీపీఈ కిట్ ధరించి అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్‌లను పరిశీలించారు. అలాగే, ఆ సంస్థ ప్రమోటర్లతో పాటు ఎగ్జిక్యూటివ్‌లతో మోడి మాట్లాడారు. మోడిని చూసేందుకు జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ వద్దకు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో వారికి మోడి అభివాదం చేశారు. అహ్మదాబాద్‌ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చి భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ పరిశీలించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/