మహబూబాబాద్ జిల్లా యువకుడికి ఆర్ధిక సాయం చేసిన గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లా యువకుడికి ఆర్ధిక సాయం చేసి వార్తల్లో నిలిచారు. గత కొద్దీ రోజులుగా తమిళి సై పేరు వార్తల్లో హైలైట్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. టీఆరఎస్ ప్రభుత్వానికి – తమిళి సై కి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. పలు సందర్భాలలో ఆమె స్వయంగా టీఆరఎస్ ప్రభుత్వం అస్తమించింది చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం తో సంబంధం లేకుండా తనపని తానుచేసుకుంటూ వెళ్తుంది. రాజ్ భవన్ కంటే ప్రజా క్షేత్రంలో తిరగడానికే ఇష్టపడుతున్నాు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేదల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాళ్లతో మమేకం అవుతూ.. తన పరిధిలో సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన యువకుడికి తమిళ సై ఆర్ధిక సాయం చేసారు. గ్రామానికి చెందిన మందుల రామ్మూర్తి నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అయినా కూలీ పనులకు వెళ్తూ ఎంతో కష్టపడి ఇంటర్ వరకు చదివాడు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేక చదువు మధ్యలోనే ఆపేశాడు. కుటుంబాన్ని చూసుకోవడం, ఇంటి బాధ్యతలు మీద పడడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చేదారి లేక ఆవేదనకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సహాయం చేయాలంటూ జనవరి 2న రాజ్ భవన్ లోని ఫిర్యాదుల బాక్స్ లో తన లేఖ వేశాడు. దీంతో రాజ్ భవన్ నుంచి నాలుగు రోజుల కింద ఆర్థిక సహాయంగా గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రూ. 25వేల డీడీ పంపించారు. గవర్నర్ సాయం చేయడంతో రామ్మూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.