గూగుల్‌ ఉద్యోగులకు శుభవార్త

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న గూగుల్‌ ఉద్యోగులు రూ.రూ.75,000 అలవెన్స్

google
google

కాలిఫోర్నియా: కరోనా లాకౌడౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసలా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యలయాలను నడిపేలా కంపెనీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో గూగుల్‌ తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే తమ ఉద్యోగులందరికీ రూ.75,000 చొప్పున అలవెన్సులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ అలవెన్స్‌తో ఉద్యోగులు ల్యాప్‌టాప్ నుంచి ఫర్నీచర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు కావాల్సిన గ్యాడ్జెట్స్ కొనుక్కోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు ఇబ్బందులు ఉండొద్దని, ఇంట్లో సౌకర్యవంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో గూగుల్ ఈ అలెవన్సును ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఈ అలవెన్స్ కాస్త భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇంట్లోనే సమర్థవంతంగా పనిచేసేందుకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ నిర్ణయం ఈ కష్టకాలంలో ఉద్యోగుల గురించి కంపెనీ ఆలోచిస్తుందన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఇక జూలై 6 నాటికి ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆఫీసులను తెరిచే ఆలోచనలో ఉంది గూగుల్. ప్రతీ ఆఫీసులో 10% మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. ఆఫీసుకి వచ్చి పనిచేయాలనుకునేవారికి అనుమతి ఇవ్వనుంది.

ఈ ఏడాది అంతా గూగుల్ ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచే పనిచేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావాల్సిన గ్యాడ్జెట్స్, ఫర్నీచర్ కొనుక్కోవడానికి ప్రతీ గూగుల్ ఉద్యోగికి 1000 డాలర్లు(సుమారు రూ.75,000) అలవెన్స్ ఇస్తున్నాం.
— ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో సుందర్ పిచాయ్, గూగుల్, ఆల్ఫబెట్ సీఈఓ


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/