కూరగాయలు పండించి ఇస్తామంటే .. అందరూ వింతగా చూశారు

కూరగాయలలో రూ .కోటి వ్యాపారం చేసిన అర్చన విజయ పథం ఇది..

అర్చన స్టాలిన్ …కోటి ఆశలతో మొదలు పెట్టిన వ్యాపారం నష్టాలు మిగిల్చింది.. ప్రేమ, పెళ్లి చేసుకుందని అమ్మ నాన్నల సహకారం లేదు.. ఉన్నదల్లా ఆత్మ విశ్వాసమే. ఆ ధైర్యమే చిన్నవయసులోనే అర్చన ను వ్యాపారవేత్తను చేసింది. మహిళలకు మిద్దె తోటలను పరిచయం చేస్తూ సేంద్రియ ఉత్పత్తులను అందిస్తూ , మరోవైపు వందలాది రైతులకు అండగా నిలుస్తున్న అర్చన స్టాలిన్ విజయ ప్రస్థానం ఇది..

Archana Stalin Victory Series


చెన్నై గిండి ఇంజనీరింగ్ కాలేజీ లో జియో ఇన్ఫర్మాటిక్స్ చదివింది. సహాధ్యాయ స్టాలిన్ కాళిదాసు ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు దూరం పెట్టారు. అపుడే తానేంటో నిరూపించు కోవాలను కుంది అర్చన.. 2012లో జియో వెబ్ అనే పరికరాల సంస్థను తన భర్తతో కలిసి స్టార్ట్ చేసింది. నగలు అమ్మి స్నేహితుల చేబదులుతో రూ . 10 లక్షలు పెట్టుబడి పెట్టింది. రెండేళ్లలోనే ఆ వ్యాపారం నష్టాల్లో పడింది. అప్పటికి తన వయస్సు 22 సంవత్సరాలు . మరొకరు అయితే మరలా వ్యాపారం మాటెత్తేవారు కాదేమో. కానీ అర్చన నష్టాల నుంచి గెలుపు పాఠాలను నేర్చు కుంది.

రెండు ఎకరాలతో మొదలు…

అప్పులు తీర్చటానికి ఉద్యోగంలో చేరింది. మరోవైపు మార్కెటింగ్ లో అనుభవాన్ని సంపాదించింది. ఈ సారి తన దృష్టి సేంద్రియ, పట్టం వ్యవసాయంపై పడింది. ఆ రంగంలో అనుభవం ఉన్నవారిని , రైతులను కలుసుకుంది . ఏయే సీజన్లో ఏయే పంటలు వేయాలి .. సాగులో సాధక బాధలు, వంటి వాటిపై అధ్యయనం చేసింది. 2016లో మై హార్వెస్ట్ సంస్థను స్థాపించింది. ఇది వ్యాపారం అనుకోకుండా , అందరికి ఉపయోగపడే ఓ మంచి పని అనుకున్న, బాల్కనీల్లో , మిద్దెపైన కాయ గూరలు , ఆకు కూరలు పండించు కోవటంలో శిక్షణ ఇష్టం . కావల్సినవి సమకూరుస్తాం . సొంతంగా పండిచినవి వండుకోవటంలో ఆ ఆనందమే వేరు. ఇదే చాలా మంది మహిళలను ఈ బాల్కనీ వ్యవసాయంపై ముందుకు వచ్చేలా చేసింది. మొదట నా మెట్టి నిల్లు అయినా వీరుడు నగర్ లో ప్రారంభించా.. ఆ తర్వాత 10 పాఠశాలల్లో సేంద్రియ పద్దతుల్లో కాయగూరలు పండించటం నేర్పించే దాన్ని. తిరువల్లూరులో 2 ఎకరాలను ఏడాదికి రూ . వేలకు అధీకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించా. ఏడాది అయ్యే సరికి మా కూరగాయలను చెన్నై లోనే ప్రముఖ సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలకు పంపిణి చేయటం మొదలుపెట్టా. ఆసక్తిఉన్న వారికి మా పొలంలో కూరగాయ లను పండించి ఇస్తామని చెప్పాము. నెలకు రూ . 3 వేలు కడితే వారి స్థలంలో కూరగాయలను వారే తీసుకెళ్లొచ్చు..

Organic farming- Archana Stalin Victory Series
Organic farming- Archana Stalin Victory Series

18 కుటుంబాలతో మొదలై ఇపుడు 10 వేల కుటుంబాలకు మా ఉత్పత్తులు అందిస్తున్నాము. మీకు కూరగాయలు పండించి ఇస్తాము .. అని చేపినపుడు చాల మంది నన్ను వింతగా చూసారు. అపనమ్మకంగా చూసారు, ఆ తర్వాత వారే ఒత్తిడి చేయటం ప్రారంభించారు అందుకే వెంబు ఫార్మ్స్ పేరుతొ చుట్టూ పక్కల రైతులను కలుపుకున్నాను. మొదట ఏడాదిలో రూ . లక్షల వ్యాపారం చేసాం. రెండో ఏడాది రూ . లక్షలకు చేరింది. గత ఏడాది రూ .కోటి వ్యాపారం చేశా.. ప్రస్తుతం 500 మందికి పైగా రైతులతో కలిసి పనిచేస్తున్నా . అంటూ అర్చన వివరించింది.

‘తెర’ సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/