మార్పులను ఆస్వాదించాలి

Happy Movements

ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. ఆనంద మయ మైన మనసు ఔషధంలా పనిచేస్తుంది. లక్ష్యంపై శ్రద్ధాసక్తుల్ని చూపండి. లక్ష్యసాధనలో సైతం చూపించాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే అసలు సమస్యలే రావు. ఓర్పు అనేది అలవర్చుకోవాలి. చిన్న చిన్న విషయా లకు ఇరిటేట్‌ కావద్దు. అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచాలి. ఇతరులు చెప్పేది కూడా స్థిరంగా వినండి. ఎప్పుడూ ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సరికొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, తెలియని విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సుకతను కలిగి ఉండాలి. మారుతున్న ప్రపంచానికి అను గుణంగా మారాలన్న తపన గలిగి ఉండండి.

కాలంలో, దాని మాయాజాలంలో పడడం కాదు. కాలం వెంట పడాలి. కాలం గుర్తు పెట్టుకునేంతలా వెంటపడాలి అన్నారొక కవి. విజేతలకు, పరాజితులకు ఉన్న సమయం ఒక్కటే. తేడా దానికి వాడుకునే తీరు. వాడుకను బట్టి ఫలితం ఉంటుంది. మన కాలం మన ఆధనంలో ఉండాలి. అప్పుడు అన్నీ కాలం వెంట ఉంటాయి. కాలాన్ని అనుకూలంగా, అనుగుణంగా మార్చుకున్నవారే విజేతలవుతారు. ఆదర్శంతమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. పాత జ్ఞాపకాల నుంచి నూతన ఉత్తేజంతో ఉండాలనుకోవడం సానుకూలదృక్పథమే. కుటుంబంతో ఎక్కువ సేపు గడపాలి. అమ్మమ్మ లేదా నానమ్మలు తాతయ్యలతో మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేసేలా ఉండాలి. కొత్త స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని తీర్మానాలను చేసుకోవాలి. రోజూ కొన్ని విషయాలు అంటే కొత్తగా అనిపించిన విషయాలు రాసుకోవాలి. మనిషి ఆలోచనవిధానం, మానసిక పరిపక్వత, మంచి చెడుల స్వీకరణ, స్పందించే మనస్తత్వం వంటి అంశాలు ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందగలడు. ఆలోచనలు పాతవే అయినా ఆచరణ కొత్తగా ఉండాలన్ని ఎంతో మంది చెప్పేమాట. మార్పు అవసరం.

కాని దానిపై స్పష్టమయిన అవగాహన అవసరం. తీసుకునే నిర్ణయం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. చేసే పని సక్రమంగా చేస్తే ఎప్పుడూ అధికంగానే సాధించగలం. బాధ్యతకు నమస్కరిస్తే ఎవరికీ నమస్కరించనక్కరలేదు.
కానీ బాధ్యతను మలిన పరిస్తే మటుకు ప్రతి వ్యక్తికి నమస్కరించక తప్పదు. శ్రద్ధగా రోజుకు 8 గంటలపాటు పనిచేయడం వల్ల చివరకు యజ మాని అయి రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తారు. ఉన్నతంగా ఉండాలన్న విజయ లక్ష్యంతో ఉంటే దానిని అందుకు నేందుకు అలుపెరుగని ప్రయత్నమే సాక్ష్యం. గెలవాలనే ఆరాటమే గెలుపుకు పోరాటం. గెలుపనేది కాదొక విరామం.

గెలుపనేదొక నిరంతర ప్రయాణం. మీలో ఉన్న విల్‌పవర్‌ సాయంతో అద్భుతాలు సృష్టింవచ్చు. మనం అనుకు న్నది అనుకున్నప్పుడు చేసేలా చేయగలిగే అంతర్గత ప్రేరణే ఇది. ఉత్సాహం మరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఉండాలి. అనుక్షణం మీరు ఉత్సాహంతో ఉండాలి. మీలో ఉత్సాహం మిమ్ములను విజయపథం నడప గలదు. మీరు చేసే పనిలో మీకు తృప్తి లభించాలంటే మీరు ఉత్సాహంగా ఆ కార్యానికి ప్రయత్నిం చాలి. కార్య సాధన లోనూ ఉత్సాహం గానే ఉండాలి.

అనుక్షణం ఉత్సాహంతో ఉరకలు వేయాలి. ఉత్సాహం అనేది లేకుండా పోతే పనిని మనస్ఫూర్తి గా చేయలేరు. మన ఆదాయం మన కాలిబూట్లులాగా ఉండాలి. కాలి బూట్లు మరీ చిన్నవయితే అవి గాయాన్ని చేసి కాలును కొరుకుతాయి. మరి పెద్దవయితే మనల్ని తట్టుకుని పడేలా చేస్తాయి. కానీ సంపద అన్నది సాపేక్షమైనది. సంపద కొంతమాత్రమే కలిగి కొంత మాత్రమే కావాలనుకునేవాడు సంపద ఎక్కువగా ఉండి ఇంకా కావాలనుకునే వాడికంటే ధనవంతుడు. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు ఎదురుదెబ్బలకు వెరువక అవరోధాలకు బెదరక ముందుకు సాగాలి. ఎందుకంటే విజయం రోజులో లభించేది కాదు.

గమ్యం గంటలో చేరేది కాదని గుర్తెరగాలి. విజయం అనేది నిరంతర ప్రయాణమని దానికి కామా తప్ప ఫుల్‌స్టాప్‌ గుర్తు ఉండదన్న నిజాన్ని తెలుసుకోవాలి. కాలం విలువైనది. రేపు అనే దానికి రూపం లేదు. మంచిపనులు వాయిదా వేయండి. ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. ఆనందమయమైన మనసు ఔషధంలా పనిచేస్తుంది. లక్ష్యంపై శ్రద్ధాసక్తుల్ని చూపండి. లక్ష్యసాధనలో సైతం చూపించాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

ఎదుర్కొంటే అసలు సమస్యలే రావు. ఓర్పు అనేది అలవర్చుకోవాలి. చిన్న చిన్న విషయా లకు ఇరిటేట్‌ కావద్దు. అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచాలి. ఇతరులు చెప్పేది కూడా స్థిరంగా వినండి. ఎప్పుడూ ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సరికొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, తెలియని విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సుకతను కలిగి ఉండాలి.

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారాలన్న తపన గలిగి ఉండండి. తమను తాము ఉత్సాహపరచు కోవ డం అలవరుచుకోవాలి. ఆలోచనలెప్పుడూ చేయ బోయే కార్యాలకు సంబంధించిన వాటిపైనే కేంద్రీకృతమై ఉండాలి. ఎదురు దెబ్బలను ఏ మాత్రం లెక్కచేయని మనస్తత్వం కలిగి ఉండాలి.
ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. చరిత్రలో శాశ్వత యశస్సును పొందిన వారిలో సేవాభావం కలవారే అధికంగా ఉన్నారన్నది నగ్నసత్యం. స్వార్థరహితమైనది, పరమార్ధ సహితమైనది అయిన సేవా రూపంలో చేసినా మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. మీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.

పరుల కోసం మీరు చేసే ప్రతి నిస్వార్ధ సాయం జీవితంలో మిమ్మల్ని సక్సెస్‌వైపు ఒక్కొక్క అడుగు నడిపిస్తుంది. ఎప్పుడూ ఛాలెంజ్‌లను ఇష్టపడాలి. రిస్క్‌ తీసుకుని పనిచేయడానికి ఆసక్తి చూపాలి. అదేవిధంగా మీరు చేసే పని మీద స్పష్టత కలిగి ఉండాలి. చేసే కార్యం పట్ల ఆసక్తి కనబరచాలి. ఇతరుల సలహాలను, సూచనలను ఎప్పుడూ నెగటివ్‌ దృక్పథంలో చూడరాదు.
అప్పుడు పట్టుదలతో చేసే తీర్మానాలను మధ్యలో వదిలేయకుండా కొనసాగించే వీలుంటుంది. తీసుకునే నిర్ణయంపై స్పష్టత ఉండాలి.

కాలవిభజన పనికి అడ్డుకుండా ఉండేలా చూసుకోవలి. బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం మనిషికి సొంతం. సాధించే లక్ష్యాలను ఎంచుకోవాలి. నిర్ణయాలను పాజిటివ్‌ కోణంలో తీసుకోవాలి. లక్ష్యసాధన కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. ఊహలు, ఆలోచనలకంటే ఆచరణ ముఖ్యం. ఆశయ సాధన, ఆచరణ ముఖ్యం. ఆనంద సమయాల్ని హద్దుల్ని అతిక్రమించకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోడంపై దృష్టిని సారించాలి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/