వ్యాధి – నివారణ : షిర్డీ సాయి లీలలు

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబా వంటి సాధు సత్పురుషులు తమ భక్తులను ఆదుకుంటారు. తమకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా భక్తులను కాపాడతారు. విధంగానే కాపాడాలనే నియమం ఉండదు వారికి. హుమ్నాబాద్‌లో మాణిక్య ప్రభువు ఉండేవారు.

ఒకసారి ఆయన వద్దకు అరుణప్ప అనే భక్తుడు వెళ్లాడు. అరుణప్పకు ఉబ్బురోగం వచ్చింది. ఆ వ్యాధి నివారణ కాలేదు. అతడు మాణిక్య ప్రభువును ప్రార్థించాడు. మృత్యువు తొందరగా ప్రసాదించినా చాలునని ఆ భక్తుని ప్రార్థన. మాణిక్య ప్రభువు అరుణప్ప చెప్పిన దంతా విన్నారు. పెరుగులో అటుకులు, నువ్వులు నానవేసుకుని కొన్ని దినాలు పుచ్చుకోమన్నారు ప్రభువులు.

ఆ సమయంలో ఆ వైద్యం చేస్తే ప్రాణానికే ముప్పు అని చాలా మంది చెప్పారు అరుణప్పకు. అయినా ఇతరుల మాట వినదలచుకోలేదు అరుణప్ప. మాణిక్య ప్రభువు చెప్పిన వైద్యం ప్రారంభించాడు. కొద్దిరోజులు గడిచాయి. వ్యాధి నివారణ అయింది. జనవాక్యం వేరే విధంగా ఉంది. మాణక్య ప్రభువుల మందు భిన్నంగా ఉంది. ఇక్కడ పనిచేసింది. మాణక్య ప్రభువులపై ఉన్న విశ్వాసము మాత్రమే. కొండునానా అనేవాడు అక్కల్‌కోట మహారాజు భక్తుడు. అతని కాలిపై ఒక రుగుగుకుట్టింది. ఒక బాధ మొదలైంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు.

ఆయనకు తెలిసిన వైద్యులెందరో ఉన్నారు. ఆ వైద్యులు కాలును తీసివేయాలని చెప్పారు. కాలును తీసివేయించే సాహజం కొండునానా చేయలేకపోడు. ఇక ఏమీ చేయలేక అక్కల్‌కోట వెళ్లాడు. మహారాజుకు తన పరిస్థితిని వర్ణించి చెప్పాడు. బియ్యం కడిగిన నీరు తాగమని, ఉల్లిపాయను తినమని అక్కల్‌ కోట మహారాజ్‌ చెప్పారు.

అందరూ అక్కల్‌ కోట మహారాజ్‌ హాస్యానికి అలా పలికారు. హాస్యంగా పలికినా, నిజంగా పలికినా, సమర్ధుల మాట మాటే అని అతనికి తెలుసు. వెంటనే వైద్యం ప్రారంభించాడు. జబ్బునమయింది. ముంబయిలో ప్రభాకర్‌ గణపత్‌ షిరూర్‌ అనే వ్యక్తి నివసించేవాడు. ఆయనకు గణేష్‌ పురిలో ఉండే నిత్యానంద బాబా గురించి అంతగా తెలియదనే చెప్పాలి. అతని అత్తగార్కి, భార్యకు, వదినకు ఆ మహనీయుని పై నమ్మకం. అందరూ నిత్యానందబాబాను నమ్మవలెననే నియమం లేదు. షిరూర్‌కు చెవుడు రావటం మొదలయింది.

చెవుడు పెరుగుతోంది. పదవులు పగలసాగాయి. మొహం మీద బొబ్బలు రాసాగాయి. ఆయన వైద్యం చేయించుకున్నాడు. ఫలితం కనపడలేదు. నిరుత్సాహం పొందనారభించాడు. ఆయన భార్య, అత్త, వదినలు గణేష్‌పురిలో ఉన్న నిత్యానందబాబాకు ఈ విషయం చెప్పి, రోగవిముక్తిని చేయమని ప్రార్ధిద్దామని వెళ్లారు. ఆ ముగ్గురు మహిళలు వెళ్లిన సమయంలో బాబా నేతమ్రులు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. ఆ ముగ్గురు ఆ మహనీయుడు కన్నులు తెరచేవరకు వేచి ఉన్నారు. ఆ ముగ్గురి నోట నుండి మాట రాక ముందే ‘ఇంటికి వెళ్లండి అన్నారు బాబా. అయినా ఆ ముగ్గురు చేతులు జోడించి నిలబడే ఉన్నారు.

స్వామి మరల కనులు మూసుకున్నారు. అయినా వారు కదలక, నమస్కార భంగిమలోనే ఉన్నారు. ఆయన కన్నులు తెరచారు. ‘ఏమీ కావాలి మీకు? అని ప్రశ్నించారు బాబా. షిరూర్‌ యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి విన్నవించుకున్నాడు వారు. ‘మీ ఇంట్లో దత్తాత్రేయుడి పటం ఉన్నదా? అని ప్రశ్నించారాయన. చూస్తాము. లేకుంటే వెంటనే దత్తాత్రేయుని పటం తెప్పిస్తాము అన్నారు ఆ మహిళలు.

‘ప్రతిరోజు ముఖ్యంగా ప్రతి గురువారం దత్తాత్రేయుని ఫొటోకు పూలదండ వేయండి. బాగవుతుంది అన్నారు నిత్యానందస్వామి. ఆ మహిళలు ముంబయి వెళ్లి నిత్యానందస్వామి చెప్పినట్లు చేశారు. వ్యాధి పూర్తిగా పోయింది. వ్యాధికి చికిత్సకు పొంతనే ఉండదు మహనీయుల మాటలలో రోగనివారణ జరిపేది వారి వాక్కే.

– యం.పి.సాయినాథ్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/