ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

road-accident
road-accident

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సును వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రాలక్నో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ దుర్ఘటన. బస్సు ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతిహరికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/