గోముఖాసనం

gomukhasana
gomukhasana

ఈ ఆసనం వేసిన తరువాత చూడటానికి ఆవు ముఖం వలె ఉంటుంది కాబట్టి దీని గోముఖాసనం అనే పేరు వచ్చింది. నేల మీద కూర్చున్న తరువాత ఎడమ కాలిని మడిచి మడమను మోకాళ్లు, పిరుదులకు తగిలేట్లు చేయాలి. కుడికాలును ఎడమతొడపై వేసి ఉంచాలి. తరువాత ఎడమ చేతిని వీపు వెనక్కి పోనిచ్చి, కుడిచేతిని పైకెత్తి వెనక్కు మడిచి ఎడమచేతిని పట్టుకోవాలి. నడుము భాగాన్ని నిటారుగా ఉంచాలి. ఈ ఆసనాన్ని రోజూ సమయాన్ని పెంచుతూ వేయాలి. శరీరం లావుగా ఉండే వారు కొంత శ్రమతో ఈ ఆసనాన్ని రోజు వేస్తుంటే శరీరం సన్నబడుతుంది. ప్రాణవాయువు బాగా అందుతుంది. కీళ్లనొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి. చేతులు, భుజాలు బలపడతాయి. గుండె, ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. ఆకలి బాగా కలుగుతుంది. ప్రాణాయామం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/