ఎముకల బలానికి..

bone-strength
bone-strength

మెనోపాజ్‌ వచ్చాక ఎక్కడైనా జారిపడినా ఎముక విరుగుతుంది. అడుగు తప్పినా ఫ్రాక్చర్‌ అవ్ఞతుంది. చాలా మందిలో కనిపించే ఈ సమస్యనే ఆస్గియోపొరోసిస్‌ అంటారు. ఎండుపుల్లలా మారిన ఎముకలు చిన్న దెబ్బలకే విరుగుతుంటాయి. కాళ్లు, కీళ్లు కదలికలు తగ్గి క్రమంలో విశ్రాంతికే పరిమితమయ్యే పరిస్థితి ఎదురుకావచ్చు.
కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఎముకలు మినరల్స్‌తో తయారవ్ఞతాయి. కాల్షియం, కొలాజిన్‌ ఫైబర్స్‌తో దృఢంగా మారతాయి. పురుషులతో పోలిస్తే మహిళలు ముఖ్యంగా మెనోపాజ్‌ తరువాత ఎక్కువ మంది ఆస్టియోపోరోసిస్‌ బారిన పడుతుంటారు. ఈ దశలో స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోను విడుదల ఆగిపోతుంది. ఆ ప్రభావం ఎముకలపైనా పడి ఈ సమస్యకు దారి తీస్తుంది. ముఫ్పై యేళ్లు వచ్చేవరకు ఎముక సాంద్రత పెరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ సాంద్రత క్షీణించే వేగం ఎక్కువవ్ఞతుంది. అందుకే ఎముకలు గుల్లబారుతాయి. మహిళలల్లో నెలసరి ఆగిన తరువాత ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. పైకి లక్షణాలేమీ కనిపించకపోవచ్చు. చిన్న దెబ్బలకే ఎముక విరిగిపోవచ్చు. కణజాలం క్షీణించడం, వాటి నిర్మాణ శైలిలో మార్పులు రావడం వల్ల క్రమంగా ఇవి బలహీన పడి పెళుసుబారతాయి. ఆస్టియోపోరోసిస్‌ ప్రాథమిక దశలో ఎటువంటి సూచనలు కనిపించకపోయినా సమస్య పెరిగేకొద్దికొన్ని లక్షణాలు ఎదురవ్ఞతాయి. ఏ పనీ చేయాలనిపించదు. అలసటగా ఉంటుంది. కండరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. మనోవ్యాకులత ఎదురవ్ఞతుంది. వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న కొద్దీ శరీరం వంగినట్లు అవ్ఞతుంది. ఇలా మరీ ఎక్కువగా వంగిపోయినట్లు అవ్ఞతుంటే మాత్రం ఎముకలు గుల్లబారటానికి సూచిక కావ్చని గుర్తించాలి. ఆహారంలో కాల్షియం, విటమిన్‌ డి తగినంతగా అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా బిడ్డ ఎదిగేటప్పుడు, పాలిచ్చేటప్పుడు స్త్రీ నుంచి క్యాల్షియం బిడ్డకు పోతుంది. కాబట్టి ఈ పోషకం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. రోజుకి ఎంతవరకు తీసుకోవాలనేది వైద్యుల్ని అడగాలి. పెరిగిన కాంక్రీట్‌ జంగల్‌ సంస్కృతి. ఎసి గదుల వాడకంతో చాలా మందికి తగినంత ఎండ తగలడంలేదు. రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ఇంటికే పరిమితం కావడంతో సూర్యరశ్మి అండం లేదు. నగరాల్లో దాదాపు అరవైశాతం మంది డి విటమిన్‌ సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం వల్ల ఎముక మజ్జ పెరిగి సాంద్రత పెరుగుతుంది. రోజువారి తీసుకునే ఆహారంలో చేపలు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు వంటివి తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. క్రమం తప్పకుండా కనీసం అరగంట నుంచి గంటపాటు వ్యాయామం చేయాలి. ఉదయాన్నే వ్యాయామం చేస్తే తగినంత సూర్యరశ్మి అందుతుంది. దాంతో ఎముకలు దృఢంగా మారతాయి. ముఖ్యంగా ఆరుబయట నడక, జాగింగ్‌, సైకిల్‌ తొక్కడం, ఈత, బరువెలెత్తడం వంటివి చేస్తుంటే సాంద్రత పెరుగుతుంది. మెనోపాజ్‌ దశ దాటాక ఖచ్చితంగా ఎముక సాంద్రత పరీక్షలు ప్రతి మహిళా చేయించు చేయించుకోవాలి. డ్యూయల్‌ ఎమిషన్‌ ఎక్సరే అబ్సార్సో మెట్రీ ద్వారా పరీక్ష ద్వారా ఆస్థియోపోరోసిస్‌ని గుర్తిస్తారు. సమస్య ఉండి వైద్యులు మందులు సూచిస్తే గనుక ఆరునెలలు ఆగి మళ్లీ ఎముక పరీక్ష చేయించుకోవాలి. అవసరం అనుకుంటే వైద్యులు ఎముకలు దృఢంగా మారడానికి కొన్ని మందులు సిఫారసు చేస్తారు. కౌన్సిలింగ్‌ సైతం ఇస్తారు. ఫ్రాక్చర్ల తీవ్రతను బట్టి శస్త్రచికిత్సలు చేస్తారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/