రికార్డు ధరకు చేరిన బంగారం

Gold ornaments
Gold ornaments

హైదరాబాద్‌: బంగారం ధరలు సోమవారం అమాంతం ఆకాశానికి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి. తొలి సారిగా బంగారం ధర రూ. 43 వేల మార్క్‌ను దాటింది. గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో ఇది ఫ్రెష్‌ రికార్డ్‌. అంతేకాకుండా అంతర్జాతీయ పరిమాణాలు కూడా బంగారం ధర పెరగడానికి మరోక కారణం అని చెప్పొచ్చు. కాగా 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.44వేల మార్క్ దాటింది. ఆదివారం విక్రయాల్లో గ్రాము రూ. 4,443 చొప్పున పలికింది. 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికింది. ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి గ్రాముకు రూ.4,073 ధర పలికింది. గత వారం రోజుల్లో హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,790 పెరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన రూ.42,640గా పసిడి ధర 23వ తేదీ నాటికి రూ.44,430కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ. 1,580 వరకు పెరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/