ఆగ్రాకు బయలుదేరిన ట్రంప్ దంపతులు
తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్ దంపతులు

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడి అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో ప్రసంగాలు ముగిశాయి. అనంతరం, తన పర్యటనలో భాగంగా ట్రంప్ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించేందుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్ మహల్ ను ట్రంప్ దంపతులు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/