చంద్రబాబును అడ్డుకున్న వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు

కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు

Chandrababu naidu
Chandrababu naidu

కుప్పం: టిడిపి అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబుకు కుప్పంలో వ్యతిరేకత ఎదురైంది. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/