జూన్‌ 11నుండి భక్తులకు శ్రీవారి దర్శనం

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

TIRUMALA
TIRUMALA

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్‌ 11 నుండి సాధారణ భక్తులను అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వైవీ స్పష్టం చేశారు. ఈరోజు తిరుమలలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకుని భక్తులు రావాలని, తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదని వైవీ ప్రకటించారు. వీఐపీ దర్శనానికి కేవలం గంట మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్టు మార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించమని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. పుష్కరిణిలోకి భక్తులను అనుమతించమని, అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/