54 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..అయినప్పటికీ వరద నీటిలోనే భద్రాద్రి

భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. ప్రస్తుతం 54 అడుగులకు చేరింది. దాదాపు 14,77,537 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రం వరకు 53 అడుగుల లోపు తగ్గగానే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించనున్నారు. ప్రస్తుతం గోదావరి భారీగా తగ్గినప్పటికీ రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, పలు దుకాణాలు ఇంకా గోదావరి వరద నీటలోనే మునిగి ఉన్నాయి.

ఉత్తర ద్వార ప్రాంగణం, మిథిలా స్టేడియం వద్ద కూడా వరద నీరు నిలిచేఉంది. సీఎం కేసీఅర్ రివ్యూలో అధికారులను మందలించినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. స్పెషల్ అధికారులున్నా రామాలయం పరిసర ప్రాంతాల్లో వరద నీటిని తోడేయడంలో విఫలమయ్యారు. మాసివ్ ఫ్లడ్ వస్తోందని తెలిసినా ముందే సింగరేణి మోటార్లను తెప్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. సీఎం కేసీఅర్ సూచన చేసినా వరద నీరు ఎత్తి పోయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం తో భక్తులతో పాటు అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.