పోల‌వ‌రం ప్రాజెక్టు విషయంలో మంత్రి పువ్వాడ ఫై ఏపీ మంత్రి బొత్స ఫైర్..

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల ఫై ఏపీ మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారు.? డిజైన్ల ప్రకారమే జరుగుతోంది దాన్ని ఎవరూ మార్చలేదని బొత్స అన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశంమేనని.. విభజన చట్ట ప్రకారంమే అంతా జరుగుతోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ‘ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?’ అని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని నిలదీశారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని.. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యం అని చెప్పారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని కోరారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదు..పువ్వాడ అజయ్ అయన సంగతి ఆయన చూసుకోవాలని హెచ్చరించారు.

అసలు పువ్వాడ ఏమన్నారంటే..

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని టిఆర్ఎస్ నేతలు వాపోయారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాథ‌మిక డిజైన్ మార్చి మూడు మీట‌ర్లు ఎత్తు పెంచుకున్నారు.. దీని వ‌ల్లే భ‌ద్రాచ‌లానికి వ‌ర‌ద వ‌చ్చింద‌న్నారు. ఎత్తు త‌గ్గించాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ఉంద‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వ‌ర‌ద‌ల నివార‌ణ‌కు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చొరవ చూపాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామ‌ని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి త‌మ‌ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. పోలవ‌రం కోసం తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపిన‌ప్పుడు తాము నిర‌స‌న తెలిపామ‌న్నారు. ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలి. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో పెట్టి ఆమోదించాల‌ని కోరారు.