గాడ్ ఫాదర్ నుండి ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ ప్రోమో రిలీజ్

గాడ్ ఫాదర్ నుండి ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి ,సల్మాన్ ఖాన్ లు ఇద్దరు కలిసి మాస్ స్టెప్స్ వేయడం విశేషం. ఈ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిరంజీవి , నయనతార , సత్యదేవ్ తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఈరోజు సినిమాలోని ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసారు.

ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటలో చిరుతో సల్మాన్ చేసిన మాస్ డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమలో హీరో సత్యదేవ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించాడు. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.