పార్టీని వీడబోతున్నారన్న వార్తలపై స్పందించిన బుద్ధా వెంకన్న

బతికి ఉన్నంత వరకు టిడిపిలోనే, చంద్రబాబుతోనే ఉంటా..బుద్ధా

Buddha venkanna
Buddha venkanna

అమరావతిః మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాను టిడిపిని వీడబోతున్నానంటూ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్న వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తాను బతికి ఉన్నంత వరకు టిడిపిలోనే, చంద్రబాబుతోనే ఉంటానని స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న టిడిపిని వీడబోతున్నారన్న వార్తల వెనక ఓ కారణం కూడా ఉంది. విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.

అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. వేదికపైకి వెళ్లొద్దని ఆయనను వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి బయటకు వచ్చారు. అంతే.. ఆయన టిడిపిని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.ఈ ప్రచారంపై స్పందించిన వెంకన్న.. వాటిని ఖండించారు. అలాంటి ఆలోచనేదీ తనకు లేదని, కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నంత వరకు టిడిపిలోనే ఉంటానని, చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/