చందనగర్‌లో విషాదం..ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య

Another student of IIT Hyderabad committed suicide

ఇటీవల అతి చిన్న చిన్న విషయాలకు స్కూల్ , కాలేజ్ స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తండ్రి ఫోన్ కొనివ్వలేదనో..బైక్ కొనివ్వలేదనో..పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనే..ఫెయిల్ అయ్యననో..ప్రేమ విఫలమైందనో ఇలా చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దారుణం జరిగింది. ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక 6 వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది.

6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్‌లో చదువుతుంది. పాఠశాల అనంతరం బాలిక ఇంటికి వచ్చింది . బాలికను మ్యాథ్స్‌ ట్యూషన్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బాలిక తాను వెళ్లను అని తెగేసి చెప్పింది. దీంతో బాలికపై తల్లి ఒత్తిడి తీసుకురావడంతో బాలిక 15వ అంతాస్థులోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

తమ కూతురు రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతిపై ఆరా తీశారు. మృతురాలి తండ్రి సందీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.