ఎన్టీఆర్ మూవీ కోసం టాప్ టెక్నీషన్లను దించుతున్న కొరటాల

కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సి ఉండగా..ఆచార్య దెబ్బకు శివ కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం కాస్త ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సినిమాకోసం టాప్ టెక్నీషన్ల ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆర్ట్ డిజైనర్ బాహుబలి ఫేమ్ సాబు సిరిల్ ను కూడా ఫిక్స్ చేశారట. సినిమాను చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని ఈ ఇద్దరు ప్రముఖ టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ తో మరొక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఇక హీరోయిన్ విషయంలో అయితే ఇంతవరకు అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన ఇచ్చింది లేదు. కానీ రకరకాల పేర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాతనే హీరోయిన్ వివరాలు తెలియజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.