పది రోజుల్లో కొత్త పార్టీ ప్రకటిస్తానని తెలిపిన గులాం నబీ ఆజాద్

Ghulam Nabi Azad to announce new party in 10 days

కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్..మరో పది రోజుల్లో కొత్త పార్టీ ని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతు ఇచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగినట్టు ప్రకటించారు.

జమ్మూలో 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గలా పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. మరో పది రోజుల్లో కొత్త పార్టీ ని ప్రకటిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏలో పలుసార్లు కేంద్రమంత్రిగా, 2005 నుంచి 2008 వరకు జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రిగాను సేవలందించారు.