గాడ్ ఫాదర్ ఫస్ట్ డే కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు.

ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉందని ప్రేక్షకులు చెపుతూ వస్తున్నారు. సోషల్ మీడియా లోను సినిమా ఫై పాజిటివ్ గా స్పందిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 3.29 కోట్లు
సీడెడ్‌లో రూ. 3.18 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 1.26 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు
గుంటూరులో రూ. 1.75 కోట్లు
కృష్ణాలో రూ. 73 లక్షలు
నెల్లూరులో రూ. 57 లక్షలతో కలిపి రూ. 12.97 కోట్లు షేర్, రూ. 21.40 కోట్లు గ్రాస్ సాధించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 12.97 కోట్లు రాబట్టింది. ఇక కర్నాటకలో రూ. 74 లక్షలు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 16.26 కోట్లు షేర్‌, రూ. 38 కోట్లు గ్రాస్ సాధించింది.