చిత్రసీమ పెద్ద దిక్కును కోల్పోయింది – చంద్రబాబు

రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణ వార్త తెలిసి యావత్ చిత్రలోకం తో పాటు రాజకీయ ప్రముఖులు సైతం షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిజపరచడమే కాక కడసారి ఆయనకు వీడ్కోలు పలికేందుకు తరలివచ్చింది.

కృష్ణంరాజు మరణం పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ” కృష్ణంరాజుని కోల్పోవడం బాదేసింది. ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేనిది. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాలలోకి వచ్చారు. సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన లెగసి ఎప్పటికీ ఉంటుంది. ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. ఇది చాలా విషాద సమయమన్నారు. ప్రభాస్ కు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు రాజకీయ నేతలు కృష్ణంరాజు కు నివాళ్లు అర్పించారు.