స్వస్తిక్ మినహా ఇతర గుర్తులతో ఓటు పనికిరాదు
ఇసి సర్క్యులర్‌కు హైకోర్టు బ్రేక్

Hyderabad: జిహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సరి కొత్త మలుపుతిరిగింది. బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపు వేసినా ఓటేసినట్లుగానే పరి గణించాలంటూ గురువారంఅర్థరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ సర్కులర్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టు అదేశాలు జారీ చేసింది. గురువారం ఎన్నికల సిబ్బందితో నిర్వహిం చిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు, పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఓట్లనూ లెక్కించాలని ఎన్నికల అధికారులకు సూచించింది.
ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/