ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు..మావోయిస్టు ద‌ళ క‌మాండ‌ర్ మృతి

రాయ్‌పూర్ : నేడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసు బ‌ల‌గాల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయ‌ణ్‌పూర్ జిల్లా బ‌హ‌కేర్ అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు క‌మాండర్ హ‌త‌మ‌య్యాడు. మృతుడిని మావోయిస్టు 6వ కంపెనీ క‌మాండ‌ర్ సాకేత్‌గా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఏకే-47 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డేతో పాటు పలువురు కీలక సభ్యులు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మిలింద్‌ మృతిని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మొత్తం 26 మంది మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/