బాలయ్య కూడా దిగుతున్నాడు.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గతంలోనే ప్రారంభమైనా, ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఏమిటనేది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. అయితే ఈ సినిమాకు ఇదే టైటిల్ అంటూ సినీ వర్గాల్లో పలు వార్తలు గతంలోనే చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమా నుండి కేవలం ఒక్క టీజర్‌ను మాత్రమే చిత్ర యూనిట్ ఇప్పటివరకు రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా టైటిల్ ఏమిటా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే ఈ ఆసక్తికి తెరలేపేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు బోయపాటి అండ్ టీమ్ రెడీ అయ్యారు. ఈ సినిమా టైటిల్‌ను ఉగాగి రోజున మధ్యాహ్నం 12.33 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ అనౌన్స్‌మెంట్‌తో బాలయ్య అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు ఏ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తారా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.

బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోయపాటి ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి బాలయ్య ఎలాంటి టైటిల్‌తో బరిలోకి దిగుతాడో తెలియాలంటే ఉగాది పండగ వరకు వెయిట్ చేయాల్సిందే.