ఘంటసాల రెండో కుమారుడు కన్నుమూత

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నరత్నకుమార్

చెన్నై : దిగ్గజ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలడం గమనార్హం. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/