హరిరామజోగయ్య ఫై కౌంటర్ వేసిన మంత్రి అమర్ నాధ్

సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్య ఫై కౌంటర్ వేశారు మంత్రి అమర్ నాధ్. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివని, సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకంటూ మంత్రి అమర్ నాధ్ కు హరిరామ జోగయ్య లేఖ రాసారు. అలాగే అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నానని లేఖ లో పేర్కొన్నారు. ఈ లేఖ ఫై మంత్రి అమర్ నాధ్ స్పందించారు.

‘కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కల్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ మంత్రి అమర్ నాధ్…హరిరామ జోగయ్య లేఖకు స్పందించారు.