యాక్షన్ కింగ్ అర్జున్ స్పెషల్ సాంగ్

యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా

యాక్షన్ కింగ్ అర్జున్ స్పెషల్ సాంగ్
Boyapati-Sony Charista

ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్ హీన్ ఫాతిమా నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరు’.

తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి.చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రలు పోషించారు. 

యాక్షన్ కింగ్ అర్జున్ జన్మదినం (ఆగస్టు 15) సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ పై చిత్రీకంరించిన ప్రత్యేక గీతాన్ని.. సంచలన దర్శకులు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు.

ఈ ప్రత్యేక గీతంలో సోనీ చరిష్టా నటించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సోనీ చరిష్టా, ప్రముఖ యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ‘ఇద్దరు’ కో-ప్రొడ్యూసర్ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

బోయపాటి మాట్లాడుతూ.. ‘యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఇద్దరు’ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాతో సోనీ చరిష్టాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

సోనీ చరిష్టా మాట్లాడుతూ… ‘యాక్షన్ కింగ్ అర్జున్ బర్త్ డే సందర్భంగా… ఆయనతో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సర్ చేతుల మీదుగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది.

బోయపాటి శ్రీను గారికి.. మిర్యాల రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మా డైరెక్టర్ సమీర్ గారు ‘ఇద్దరు’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/