అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై జర్మనీ, ఫ్రాన్స్‌ , ఇటలీ నిషేధం

వ్యాక్సిన్ వాడిన వారిలో రక్తం గడ్డ కడుతున్నట్టు ఫిర్యాదులు

బెర్లిన్‌: ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ వాడకాన్ని ఇప్పటికే పలు దేశాలు ఆపేశాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపేశాయి. తాజాగా ఈ జాబితాలో యూరోపియన్ ఆర్థిక దిగ్గజాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా చేరాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని ఈరోజు నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

ఇక ఈ దేశాలు ప్రకటనను వెలువరించిన వెంటనే… స్పెయిన్, పోర్చుగల్, స్లోవేనియా, లాత్వియా కూడా ఇదే ప్రకటన చేశాయి. ఆస్ట్రాజెనెకా వాడకాన్ని ఆపేస్తున్న దేశాల జాబితా యూరప్ ను దాటి ఇతర ఖండాలకు కూడా వ్యాపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్టు ఆసియా దేశమైన ఇండొనేషియా కూడా ప్రకటించింది.

మరోవైపు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను వాడుతున్న దేశాలు దానిని కొనసాగించాలని సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/