మిస్త్రీకి రూ.21వేల కోట్ల ఆఫర్‌!

టిసిఎస్‌ నుంచి మెజార్టీ వాటా

Rs 21,000 crore offer to Mistry
Rs 21,000 crore offer to Mistry

న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీలో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు (ఎస్‌పిగ్రూప్‌) చెందిన 18.4శాతం వాటాని కొనుగోలు చేసేందుకు టాటా సన్స్‌ సిద్ధమైంది.

ఇందుకు 3 బిలియన్‌ డాలర్లు ఆఫర్‌చేయవచ్చునని తెలుస్తోంది. భారత దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌ అక్టోబరు 28న సుప్రీంకోర్టు ప్రతిపాదనలకు సంబంధించి నివేదిక ఇవ్వనుంది.

మిస్త్రీ గ్రూప్‌కు చెందిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌, టాటా గ్రూప్‌ మధ్య గత కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోన్న విషయం విదితమే.

ఎస్‌పి గ్రూప్‌ వాటాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేయడం కోసం అవసరమైన నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదేగ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఏర్పాటు చేయనుంది. టిసిఎస్‌లో మాతృసంస్థ టాటా గ్రూప్‌ వాటా 72 శాతం ఉంది.

ఇటీవల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన విషయం విదితమే. రూ.21 వేల కోట్లగాను టిసిఎస్‌ షేరు బైబ్యాక్‌ ద్వారా రూ.11,528 కోట్లు అంచనా వేస్తున్నాయి.

బైబ్యాక్‌ లేకుంటే టాటా సన్స్‌ టిసిఎస్‌లో ఎక్కువ వాటాను విక్రయించాల్సి ఉంటుందని ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఏప్రిల్‌ 23న నోట్‌లో పేర్కొంది.

టిసిఎస్‌లో 16శాతం వాటాను విక్రయిస్తే టాటా సన్స్‌ గ్రూప్‌ను కలిపి ఉంచే సామర్థ్యం బలహీనపడుతుందని పేర్కొంది.

టిసిఎస్‌ నుంచి వచ్చే నిధులు మిస్త్రీ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. టాటా సన్స్‌ బయటి ఇన్వెస్టర్లతోను చర్చలు జరుపుతోంది.

సావరీన్‌, పెన్షన్‌ ఫండ్స్‌తో చర్చలు జరుపుతోందని, వచ్చేరెండు వారల్లో దీనిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.

వాటాను కొనుగోలు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, టాటా సన్స్‌కు పొటెన్షియల్‌ ఇన్వెస్టర్‌ కీలకం అంటున్నారు

నిబంధనల్లో టాటాసన్స్‌ బైబ్యాక్‌ క్లాజ్‌ కూడా ఉంటే అవకాశం ఉందని అంటున్నారు. మిస్త్రీ కుటుంబం కూడా విక్రయించడానికి మొగ్గుచూపుతోంది. అయితే వ్యాల్యుయేషన్‌ దగ్గర చిక్కుముడి ఉండవచ్చునిన అంటున్నారు.

బాండ్స్‌ చెల్లింపులకు అవసరమైన నిధులను సమీకరించాలని ఎస్పీగ్రూప్‌ భావిస్తే ఆ గ్రూప్‌కు ఉన్న 18.4శాతం వాటాను కొనుగోలు చేస్తామని సుప్రీంకోర్టుకు టాటా సన్స్‌ తరపులాయర్‌ ఇటీవల తెలిపిన విషయం విదితమే.

ఒకవేళ ఎస్‌పి గ్రూప్‌ షేర్ల తనఖా ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తే ఆ షేర్లు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంటుందని టాటా గ్రూప్‌ ఆందోళన వ్యక్తంచేసింది.

ఈ నేపథ్యంలో అక్టోబరు 28వ తేదీ వరకు ఎస్‌పి గ్రూప్‌, సైరస్‌ మిస్ట్రీ, ఆయన పెట్టుబడి సంస్థలు టాటా సన్స్‌షేర్లను తనఖా పెట్టడం గానీ, బదలీ చేయడం వంటివి చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/