చంద్రబాబును కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు, జీ-20కి భారత్ నాయకత్వం తదితర అంశాలఫై వీరు ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు… గారెత్ విన్ ఓవెన్ ను శాలువా కప్పి సన్మానించారు. గారెత్ విన్ ఓవెన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ని గారెత్ విన్ ఓవెన్ కలవడం జరిగింది. ఈ సందర్బంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని సందర్శించి చిరంజీవి గారిని అభినందించారు. ఓవెన్ మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవి గారికి నా అభినందనలు అని వెల్లడించారు. నిత్యం వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ నిత్యం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ చిరంజీవిని ప్రశంసించారు.