రేపు వైజాగ్, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan’s visit to Vizag and Guntur district tomorrow

Community-verified icon


ఏపీ సీఎం జగన్ రేపు (బుధువారం) విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు జగన్ హాజ‌రు కానున్నారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు దాకమర్రి చేరుకుని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం, అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్న జగన్..ఆ తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.