బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైతు , అఖిల్

వీరసింహ రెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబ సభ్యులు , అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత సినిమాలకు సంబంధించిన విషయాల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. అక్కినేని.. ‘తొక్కినేని’ అంటూ మాట్లాడాడు. దీంతో బాలయ్య వ్యాఖ్యల ఫై సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని మనవాళ్లు నాగచైతన్య , అఖిల్ సైతం ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. కేవలం అక్కినేని అభిమానులే కాదు కాపులు సైతం బాలయ్య ఫై ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సక్సెస్ మీట్ లో ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యల పట్ల కాపునాడు మండిపడుతోంది. ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ ఈ నెల 25 లోపు మీడియా ఎదుటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్ చేసింది. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఏపీలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపులందరూ ప్లకార్డులు చేతబట్టి, మౌన ప్రదర్శన నిర్వహించాలని కాపునాడు పిలుపునిచ్చింది. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే బాలయ్య ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని.. ఆయన ఫ్యాన్స్ వివరణిస్తున్నారు. ఫ్లోలో మాట్లాడేటప్పుడు.. అలా వచ్చిందని, అంతేకానీ.. నాగేశ్వరరావు గారి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని పోస్టులు పెడుతున్నారు.