రామ్ చరణ్ మూవీ సెట్ లో సందడి చేసిన గంటా శ్రీనివాస్ రావు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా , కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెట్ లో సందడి చేసారు. సెట్ కు వచ్చిన ఆయన చరణ్, శంకర్ లను కలిసి అభినందించారు. ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

చరణ్, శంకర్ లతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. గంటా శ్రీనివాస్ కు మెగా ఫ్యామిలీ కి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ లో గంటా కీలక బాధ్యత చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నుండి చిరంజీవి తో సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికి అలాగే కొనసాగుతుంది. ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోందని లీకైన పిక్స్ చూస్తే అర్ధం అవుతుంది. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే. సూర్య, అంజలి కీలక పాత్రలను పోషిస్తున్నారు.