ప్రొడ్యూసర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సుస్మిత కొణిదెల

మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల..మెగా ప్రొడ్యూసర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ లను నిర్మించిన ఈమె..ఇప్పుడు ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే చిత్రాన్ని నిర్మించడమే కాదు ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతుంది. సంతోష్ శోభన్ – గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ డైరెక్షన్ చేసారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో చాలా సింపుల్ గా నిర్వహించారు.

ఈ సందర్బంగా సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఫ్యామిలీ & లవ్ కి సంబంధించిన ఎమోషన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తూ కనెక్ట్ అవుతాయి. దర్శకుడు ప్రశాంత్ చాలా కష్టపడి తాను అనుకున్న అవుట్ పుట్ తీసుకొచ్చాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది .. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది.

అలాగే “ఈ సినిమా షూటింగు చాలా సరదాగా సాగిపోయింది. అందరూ కూడా చాలా అంకితభావంతో పనిచేశారు. ఇంతకుముందు మా బ్యానర్ పై వెబ్ సిరీస్ లు చేశాము .. ఇది మాకు ఫస్టు మూవీ. నాన్న ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ అభిమానం .. ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నాను” అంటూ తెలిపింది.

అలాగే మెగా బ్రదర్ నాగ బాబు మాట్లాడుతూ..”సుస్మిత తలచుకుంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయవచ్చు. కానీ ఒక సాధారణమైన నిర్మాతగానే లోటుపాట్లు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వెబ్ సిరీస్ ల దగ్గర నుంచి సినిమాల నిర్మాణం వరకూ వచ్చింది. త్వరలోనే ఆమె మెగా ప్రొడ్యూసర్ గా మారనుంది” అన్నారు.

“ఇక దర్శకుడిగా ప్రశాంత్ కుమార్ ఏదైతే చెప్పాడో అదే తీశాడు. ఆయన ఒక ఎమోషనల్ సీన్ చెబుతున్నప్పుడే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కామెడీని .. సెంటిమెంటును పట్టుకుని ముందుకు వెళితే తప్పకుండా ఆయన పెద్ద డైరెక్టర్ అవుతాడు. సంతోష్ శోభన్ – గౌరీ ఇద్దరూ చాలా బాగా చేశారు. అవకాశం ఇస్తే ఆడపిల్లలు అద్భుతాలు చేయగలరనే విషయాన్ని నిరూపించే సినిమా అవుతుంది” అంటూ ధీమా వ్యక్తం చేసారు.