ఈపోరులో వైద్యులు తప్పక విజయం సాధిస్తారు

కరోనా వైరస్‌ ఉద్ధృతిపై ప్రధాని మోడి వ్యాఖ్యలు

PM Modi address Silver Jubilee celebration of Rajiv Gandhi University of Health Sciences

న్యూఢిల్లీ: ప్రధాని మోడి కర్ణాటక బెంగళూరులోని రాజీవ్ గాంథీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను వీడియో కార్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈసందర్భంగా మోడి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు పోరాటం చేస్తోన్న యోధులు, వైద్య సిబ్బంది అజేయులు. కంటికి కనపడని శత్రువు, అజేయులకు మధ్య జరుగుతోన్న ఈ పోరాటంలో మన వైద్య సిబ్బందే గెలుస్తారు’ అని మోడి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి, శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతూనే ప్రపంచమంతా ఇప్పుడు వారివంక చూస్తోందన్నారు. కరోనా వారియర్లతో దురుసుగా ప్రవర్తించినా దాడులు చేసినా ఊరుకోబోమని ప్రధాని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/