జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బలవంతుడిగా కనిపించినా… ఓ బలహీన నాయకుడు అని అభివర్ణించారు. కొత్త క్యాబినెట్ కూర్పుతో అది స్పష్టంగా కనిపించిందని , ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను, టైర్లను కాల్చుతూ ఆందోళనలు చేయటం నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూశాను.. ముఖ్యమంత్రి జరిపిన విద్యా శాఖ సమీక్షలో అ శాఖ మంత్రి పాల్గోకపోవడంతోనే అర్ధం అవుతోందని విమర్శలు చేసారు.

నూతన క్యాబినెట్ ఏర్పాటులో ఎక్కడా సమతుల్యత లేదని.. 26 జిల్లాలు అని చెప్పి ప్రధాన నగరమైన విశాఖకు, విజయవాడకు, తిరుపతి మంత్రులు లేకుండా చేశారని వెల్లడించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం అంటే ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరని.. తెలుగుదేశం పార్టీ కి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారని గంటా తెలిపారు. ఎన్నికలు దగ్గరకొచ్చే కొలది టీడీపీలోకి చేరికలు ఎక్కువవుతాయని.. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రావచ్చు అని వెల్లడించారు.