విజయవాడ లో దారుణం : మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు అత్యాచారం

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని , ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు టెన్షన్ గానే ఉందని , అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదిలి పెట్టడం లేదని అంత గగ్గోలు పెడుతుండగా..తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది.

విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17న ఆమెను కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతడి పాటు మరో ముగ్గురు ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు సోమవారం ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది. పెనమలూరు పోలీసులకు ఆసుపత్రి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.